తెలంగాణలో బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయా ? బీజేపీలో చేరడానికి ఇతర పార్టీల నేతలు వెనుకడుగు వేస్తున్నారా ? నేతలను ఆకర్షించడంలో ఈటెల రాజేంద్ర కూడా విఫలమౌతున్నారా ? అంటే ప్రస్తుత పరిణామాలు చేస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికలతో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.
అందుకోసం ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకొని బలం పెంచుకోవాలని చూస్తోంది.అందుకోసం బీజేపీ పెద్దలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
ముఖ్యంగా బిఆర్‌ఎస్ పార్టీ( BRS party ) అసంతృప్త నేతలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తూ వచ్చారు.

అందులో భాగంగానే బిఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బలమైన నేత ఈటెల రాజేంద్ర ( Etela Rajender )కు చేరికల కమిటీ చైర్మెన్ పదవి అప్పగించింది అధిష్టానం.ఈటెల కూడా ఆ పదవి చేపట్టిన మొదట్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు.అయితే ఇప్పటివరకు పెద్దగా చేరికలేవి జరగలేదు.
దాంతో ఈటెల పై బీజేపీ అధిష్టానం కొంత అసహనంగా ఉందనే వార్తలు వచ్చాయి.ఈటెల కూడా చేరికల కమిటీ చైర్మెన్ పదవి పై అసంతృప్తిగానే ఉన్నారట.
ఇదిలా కొనసాగుతుండగా బిఆర్‌ఎస్ నుంచి బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు లను బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేశారు.ఇటీవల ఈటెల రాజేంద్ర కూడా వారిద్దరితో సమావేశమైన సంగతి తెలిసిందే.

అయితే పొంగులేటి, జూపల్లి( Jupally Krishna Rao ) బీజేపీలో చేరడానికి సుముఖంగా లేరని స్వయంగా ఈటెలనే చెప్పుకొచ్చారు.ఈటెల కూడా వారిని ఆకర్షించడంలో చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.అయితే బీజేపీలో చేరడానికి ఇతర పార్టీల నేతలు ఎందుకు విముఖత చూపుతున్నారనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.బీజేపీ యొక్క విధానాలు, ఇతర పార్టీలతో పోల్చితే చాలా డిఫరెంట్.
అంతే కాకుండా ఇక్కడ నేతలకు ప్రదాన్యత దక్కడం అంతా సులువైన విషయం కాదు.ఎంత సీనియర్ నేతలైనప్పటికి అధిష్టానం అధీనంలోనే ఉండాల్సిన పరిస్థితి, నేతలకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వీలుండదు.
ఈ కారణలన్నిటి చేత బీజేపీలో చేరేందుకు అసంతృప్త నేతలు ఆసక్తి చూపడం లేదనేది కొందరి మాట.







