కళ్లు లేకపోయినా కృషితో పీహెచ్డీ సాధించిన యువతి.. శభాష్ దేవశ్రీ అని అందరూ అనేలా?

మన దేశంలో చాలామంది తల్లీదండ్రుల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తున్నా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా లక్ష్యాలను సాధించే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.అయితే పుట్టుకతోనే చూపు లేకపోయినా ఒక యువతి మాత్రం తన లక్ష్యాలను సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

 Blind Phd Scholar Devshree Bhoir Success Story Details, Devshree, Blind Phd Sch-TeluguStop.com

కళ్లు లేకపోయినా సక్సెస్ సాధించగలమని ఇప్పటికే ఎంతోమంది ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదే విధంగా ఒక యువతి కూడా తన అంధత్వ లోపాన్ని అధిగమించి పీహెచ్డీ( PhD ) సాధించడం గమనార్హం.

ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని( Chattisgarh ) గుడియాపరిలోని జనతా కాలనీకి చెందిన దేవశ్రీ బోయర్( Devshree Bhoir ) తండ్రి సహకారంతో పీహెచ్డీ పట్టాను సొంతం చేసుకున్నారు.ఆమె తండ్రి అమోఘ దేవశ్రీ ఈ డిగ్రీ సాధించడం కోసం రేయింబవళ్లు ఎంతగానో కష్టపడ్డారు.

దేవశ్రీ థీసెస్ రాయడం కోసం తండ్రి నుంచి ఎంతగానో సహకారం లభించింది.

Telugu Amogha Devshree, Chattisgarh, Devshree, Devshree Bhoir, Devshreebhoir-Gen

తాను పీహెచ్డీ సాధించడం గురించి దేవశ్రీ మాట్లాడుతూ అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింత పెంచారని నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారని వాళ్ల సాయం వల్లే నేను ఈ స్థాయిలో సక్సెస్ అయ్యానని దేవశ్రీ చెప్పుకొచ్చారు.పండిట్ రవిశుంకర్ శుక్లా యూనివర్సిటీ నుంచి ఆమె పీహెచ్డీని అందుకోవడం గమనార్హం.తన సక్సెస్ గురించి దేవశ్రీ మాట్లాడుతూ రోజుకు 10 గంటలు చదివిన రోజులు ఉన్నాయని అన్నారు.

Telugu Amogha Devshree, Chattisgarh, Devshree, Devshree Bhoir, Devshreebhoir-Gen

మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారని చిన్న ఇంటిలోనే మేము ఉంటున్నామని దేవశ్రీ చెప్పుకొచ్చారు.ఆ దుకాణం నుంచి వచ్చే ఆదాయం ద్వారా మా కుటుంబ పోషణ సాగుతోందని ఆమె చెప్పుకొచ్చారు.మా నాన్న దుకాణం నడుపుతూనే చదువులో కూడా సహకారం అందిస్తున్నాడని దేవశ్రీ కామెంట్లు చేశారు.నేను కళ్లు లేకపోయినా ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలనని ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నా నాన్న థీసెస్ కు సహకారం అందించడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube