కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.అవినాశ్ రెడ్డికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.అదేవిధంగా సీబీఐ విచారణకు సహకరించాలని సూచించింది.రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు సమర్పించాలన్న ధర్మాసనం అవినాశ్ రెడ్డి దేశం విడిచి ఎక్కడకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.







