'నమ్మకద్రోహం' సమోసా షాపు... క్యూ కడుతున్న జనాలు!

ఈమధ్య వ్యాపారస్తులు కష్టమర్లను ఆకట్టుకోవటానికి రకరకాల క్రియేటివిటీతో ముందుకు దూసుకుపోతున్నారు.ఈ క్రమంలో టీ షాపులతో పాటు హోటల్స్, రెస్టారెంట్లకు వింత వింత పేర్లు పెడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

 Man Opens Bewafa Samose Wala After Being Cheated In Love Details, Samosa Shop, V-TeluguStop.com

తిని పొండి అని ఒకరు తమ హోటల్ కి పేరు పెడితే, అమ్మ గోరు ముద్ద అని కొందరు, రా బావా తిని చూడు అని, తాళింపు, పొట్టనిండింది, నా పొట్ట నాఇష్టం ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో వింత వింత పేర్లు మనకు సోషల్ మీడియాలో వినబడతాయి.

అవన్నీ ఒకెత్తయితే మధ్యప్రదేశ్ లో( Madhya Pradesh ) వినీత్ తివారీ అనే ఓ యువకుడు ఓ సమోసా షాపుకి ‘నమ్మక ద్రోహం అని పేరు పెట్టడం మరో ఎత్తు.నెక్స్ట్ లెవల్ అని చెప్పకోవచ్చు.అయితే ఈ పేరుని చూసిన జనాలు ‘ఇతనేదో జీవితంలో బాగా దెబ్బతిని ఉన్నట్లున్నాడే’ అని అనుకోవడం సహజం.

అలా అనుకోవడమే కాదండోయ్… అతనికి చాలా పెద్ద ద్రోహమే జరిగిందని అతగాడు చెబుతున్నాడు.ఆ ద్రోహం మీరు ఊహించిందే అండి… ‘ప్రేమ.’ వినీత్ తివారీ( Vineet Tiwari ) ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు.మరి ఏం జరిగిందో ఏమోగానీ ప్రేమలో విఫలమయ్యాడు.

అయితే అతగాడు చాలామంది భగ్రప్రేమికుల్లా కంగిపోలేదు.దేవదాసులా మారి జీవితాన్ని నాశనం చేసుకోలేదు.కసిగా ఏదో చేయాలనుకున్నాడు.అలా రేవా పట్టణంలోని ఆదిత్య హోటల్ కు సమీపంలో ఓ సమోసా షాపు( Samosa Shop ) పెట్టాడు.ఆ షాపుకు ‘బేవఫా’ సమోషా షాపు అని పేరు పెట్టాడు.‘బేవఫా’ అంటే నమ్మకద్రోహి, లేదా అవిశ్వాసం అనే అర్థాలు వస్తాయి.వినీత్ తివారీ షాపులో సమోసా రూ.15లు.అయితే వినీత్ తివారీ తన షాపులో ప్రేమికులకు, భగ్నప్రేమికులకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు.మరి మనోడి సమోసాకి అక్కడ మంచి గిరాకీ ఉందండోయ్ బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube