సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్దిమంది విలక్షణ నటులలో జెడి చక్రవర్తి( JD Chakravarthy ) ఒకరు ఆయన ఒకప్పుడు హీరోగా… ఆ తర్వాత విలన్ గా మెప్పించి ప్రేక్షకులను అలరించిన జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సెలెక్టివ్ పాత్రలు ఎంచుకుంటూ సినిమాలలో నటిస్తున్న ఈయన తాజాగా ఓంకార్ షోలో పాల్గొని హీరోయిన్లకు సంబంధించిన ఒక రహస్యాన్ని బయట పెట్టడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఎప్పటికప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకునే జెడి చక్రవర్తి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు.
మొదటిసారి విలన్ గా ఇండస్ట్రీకి శివ సినిమా ( Shiva Movie ) ద్వారా పరిచయమైన ఈయన ఆ తర్వాత మనీ మనీ, గులాబీ, ఎగిరే పావురమా, బొంబాయి ప్రియుడు, హోమం, ప్రేమకు వేళాయరా, సత్య వంటి చిత్రాలలో కూడా నటించి ఆకట్టుకున్నారు.
ఒకవైపు హీరోగా.మరొకవైపు విలన్ గా, ఇంకొక వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారని చెప్పాలి.ఇక ప్రస్తుతం హాట్స్టార్ లో ఓ ఒరిజినల్ లో నటిస్తుండగా అందులో ఈషా రెబ్బా కూడా హీరోయిన్ గా నటిస్తోంది…

తాజాగా సిక్స్త్ సెన్స్ షోలో( Sixth Sense ) వీరిద్దరూ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొని సందడి చేశారు.మరొకవైపు జె.డి.చక్రవర్తి కూడా తనదైన పంచ్ లతో నవ్వులు పూయించి షో ను రక్తి కట్టించారు.తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.షోలో భాగంగా ఓంకార్.జెడి చక్రవర్తిని ఉద్దేశించి ఒక క్రేజీ ప్రశ్న సంధించారు.మీరు ఎప్పుడైనా మీ కెరియర్ లో ఏ హీరోయిన్ ని అయినా ఎప్పుడైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశారా అని ప్రశ్నించగా.అంతే బోల్డ్ గా అంతే ఫన్నీగా సమాధానం చెప్పారు…

ఆయన మాట్లాడుతూ.” మా నాన్న మీద ఒట్టు అందరూ హీరోయిన్లను కూడా నేను ట్రై చేశాను “అంటూ వెల్లడించారు.ఇక దీంతో షో మొత్తం నవ్వులు పూయగా.ప్రోమోలో ఇది చాలా హైలైట్ గా మారింది.దీంతో పాటు ఈషా రెబ్బా కూడా తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు…
.







