ఢిల్లీలో గత కొన్ని రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రెజ్లర్లు హరిద్వార్ కు పయనం అయ్యారు.
ఉదయం ప్రకటించిన విధంగా తమ పతకాలను హరిద్వార్ లోని గంగానదిలో కలుపేందుకు వెళ్తున్నారు.పతకాలను గంగలో కలిపిన తరువాత ఇండియా గేట్ దగ్గర రెజ్లర్లు ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు.
ఈ క్రమంలో రెజ్లర్లను పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది.అయితే తమను రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించిన రెజ్లర్లు సాయంత్రం లోపు స్పందించాలని అల్టీమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.







