గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.ఈ క్రమంలోనే ఈయన నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలను పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో తమన్నా ( Tamanna ) హీరోయిన్ గా నటిస్తుండగా.
కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.
మేకర్స్ అఫిషియల్ గా ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు.
మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది.గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి మ్యూజికల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తుండగా ఈ రోజు మేకర్స్ నుండి అప్డేట్ వచ్చేసింది.ఇప్పటికే కొన్ని సాంగ్స్ షూట్ కూడా మేకర్స్ పూర్తి చేయగా తాజాగా అతి త్వరలోనే భోళా మ్యూజిక్ మ్యానియా స్టార్ట్ అవుతుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఒక సాంగ్ లోని మెగాస్టార్ స్టెప్ ను బ్యాక్ లుక్ లో పోస్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ త్వరలోనే భోళా మ్యూజిక్ జాతర స్టార్ట్ అవుతుంది అని ఎలిపారు.మరి మహతి స్వరసాగర్ ఈ సినిమాకు ఎలాంటి స్వరాలూ సమకూర్చారో చూడాలి.ఇక ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.