ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, ఈ క్రమంలో టీడీపీ మేనిఫెస్టోలు తీసుకువస్తే చర్చకు సిద్ధమని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
కొడాలి నాని కామెంట్స్ పై స్పందించిన టీడీపీ నేత బోండా ఉమ తీవ్రంగా మండిపడ్డారు.టీడీపీ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయని తెలిపారు.
వైసీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారట ఎద్దేవా చేసిన బోండా ఉమ టీడీపీ హయాంలో చేసిన సంక్షేమంపై చర్చకు సిద్ధమని వెల్లడించారు.







