యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన తాళ్లసింగారం వార్డు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కొసనం భాస్కర్ రెడ్డి సోమవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మునుగోడు నియోజక వర్గం ఇంఛార్జి చలమల్ల కృష్ణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ లో చేరిన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చలమల్ల నాయకత్వంలో కలిసి పనిచేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్ మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.