కన్న కొడుకును అమ్మేశాడు ఓ కసాయి తండ్రి.ఈ అమానుష ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.
చిన్నారులను ఎత్తుకెళ్లే ముఠాకు తన నాలుగేళ్ల కుమారుడిని విక్రయించాడు తండ్రి.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు పది మంది సభ్యులున్న ముఠాను అరెస్ట్ చేశారు.అయితే పోలీసులు కళ్లుగప్పిన ఓ మహిళ తప్పించుకుని పారిపోయింది.
సదరు నిందితురాలి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.కాగా వరంగల్ ట్రై సిటీస్ లో చిన్నారులను ఎత్తుకెళ్లే ముఠా గత కొన్ని రోజులుగా సంచరిస్తున్నారని పోలీసులు గుర్తించారు.