లాక్ డౌన్ లో బాగా ఫేమస్ అయిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సంతోష్ శోభన్ ( Santosh Shobhan )అనే చెప్పాలి.ఈయన వరసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీ లో తన కంటు ఒక మంచి ఇమేజ్ ను ఏర్పరుచుకుంటు ముందు కు దూసుకెళ్తున్నాడు….
ఈయన హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’.‘అల మొదలైంది’ ‘ఓ బేబీ’ వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది.
‘స్వప్న సినిమా’ ‘మిత్రవింద మూవీస్’ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు.
టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది.ఇక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా.
![Telugu Days, Annimanchi, Theatrical-Movie Telugu Days, Annimanchi, Theatrical-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/05/anni-manchi-shakunamule-Movie-7-Days-Collections-Thats-Ita.jpg)
బ్యానర్లపై రూపొందిన ‘మహానటి’ ‘జాతి రత్నాలు’ ‘సీతా రామం’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అంతా భావించారు.అయితే మే 18న రిలీజ్ అయిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించే విధంగా నమోదయ్యాయి.వీక్ డేస్ లో ఈ మూవీ కిందా మీదా పడుతుంది.ఒకసారి 7 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే.
నైజాం 0.54 cr సీడెడ్ 0.21 cr ఉత్తరాంధ్ర 0.22 cr ఈస్ట్ 0.13 cr వెస్ట్ 0.11 cr గుంటూరు 0.15 cr కృష్ణా 0.17 cr నెల్లూరు 0.10 cr ఏపీ + తెలంగాణ (టోటల్) 1.63 cr రెస్ట్ ఆఫ్ ఇండియా 0.16 cr ఓవర్సీస్ 0.58 cr వరల్డ్ వైడ్ (టోటల్) 2.37 cr (షేర్)
![Telugu Days, Annimanchi, Theatrical-Movie Telugu Days, Annimanchi, Theatrical-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/05/anni-manchi-shakunamule-Movie-7-Days-Collections-Thats-Itb.jpg)
‘అన్నీ మంచి శకునములే’ ( Anni Manchi Sakunamule ) చిత్రానికి రూ.4.62 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.37 కోట్ల షేర్ ను నమోదు చేసింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.63 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.పోటీగా ‘బిచ్చగాడు 2’ సినిమా ఉండటం.‘అన్నీ మంచి శకునములే’ కి చాలా మైనస్ అయ్యింది.కానీ సమ్మర్ సీజన్ వల్ల స్టడీగా టార్గెట్ ను రీచ్ అయ్యే ఛాన్స్ లు లేకపోలేదు.మరి ఆ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి…