ఎడ్‌టెక్ దిగ్గజం ఫిజిక్స్ వాలా( Physics Wallah ) గురించి మీరు వినే వింటారు.ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఈ దేశీయ కంపెనీ వచ్చే రెండుమూడేళ్లలో… టెక్నాలజీని, ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను రూపొందించడం, పరిశ్రమ నిపుణులను నియమించుకోవడం తదితర అంశాల కోసమై రూ.120 కోట్లు పెట్టుబడే లక్ష్యంగా సాగిపోనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ విషయమై సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వరి( Pratik Maheshwari ) తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోర్సుల్లో ప్రాక్టికల్ శిక్షణకు అంతగా ప్రాధాన్యత ఉండటం లేదని అన్నారు.మరీ ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో శిక్షణ చాలా తక్కువగా ఉంటోందని అన్నారు.ఈ నేపథ్యంలోనే పరిశ్రమ నిపుణులు ప్రాథమికాంశాల నుంచి బోధించేలా నాణ్యమైన కంటెంట్‌ను పోటీ సంస్థలతో పోలిస్తే చాలా చౌకగా అందించడంపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అవును, నిజమే ఫిజిక్స్ వాలా ఇపుడు డేటా సైన్స్, జావా, సీప్లస్‌ప్లస్ వంటి వాటిల్లో హైబ్రిడ్ కోర్సులను కేవలం రూ.3,500కే అందిస్తోంది.
ఇకపోతే ఫిజిక్స్ వాలా ప్రైవేట్ లిమిటెడ్ మొదట ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన విద్యావేత్త అలఖ్ పాండే ద్వారా 2016లో యూట్యూబ్ ఛానెల్‌గా స్థాపించబడింది.తరువాత సహ-వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వరితో పాటు, పాండే 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మరియు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను ఒకదానిని అభివృద్ధి చేశారు.ఈ క్రమంలో అదనంగా, ఫిజిక్స్ వాలా స్కూల్ ప్రిపరేషన్, JEE కోసం కోర్సులను ప్రారంభించారు.
ఈ క్రమంలో జనవరి 2023 నాటికి, ఫిజిక్స్ వాలా యాప్ 10 మిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది.ఇటీవల, కంపెనీ $100 మిలియన్ల నిధులతో యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించింది.