అమెరికా( America ) దేశాల్లో సాధారణంగా ఎలుగుబంట్లు( Bear ) ఎక్కువగా ఉంటాయి.ఇవి జనావాసాల్లోకి వస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి.
కాగా ఇటీవల అమెరికాలోని కనెక్టికట్‌లో( Connecticut ) ఉన్న ఓ బేకరీలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది.ఎలుగుబంటి తమ స్వీట్ షాప్‌లోకి వచ్చి బీభత్సం సృష్టించిందని బేకరీ యజమాని మిరియం స్టీఫెన్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.“వర్కర్స్ ఎట్ టేస్ట్ బై స్పెల్‌బౌండ్” అనే బేకరీలోకి ఎలుగుబంటి ఎలా ప్రవేశించిందో ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వివరించారు.డెలివరీ వ్యాన్‌లో ఉద్యోగులు కప్‌కేక్‌లను లోడ్ చేస్తున్నప్పుడు ఇది జరిగిందని అన్నారు.
స్టీఫెన్స్ ప్రకారం, ఉద్యోగుల్లో ఒకరైన మౌరీన్ అకస్మాత్తుగా వ్యాన్ అవతలి వైపు నుంచి ఎలుగుబంటి తన వైపు వస్తున్నట్లు గమనించింది.ఆమె భయంతో అరిచింది.గ్యారేజీలో ఎలుగుబంటి ప్రవేశించిందని అందరినీ అప్రమత్తం చేసింది.భయాందోళనకు గురైన ఆమె వంటగదిలోకి పరిగెత్తింది.
లోడింగ్ ప్రాంతానికి దారితీసే తలుపును చకచకా క్లోజ్ చేసింది.మరోవైపు ఎలుగుబంటి ఫ్రిజ్‌లలో ఒకదాన్ని తరలించి తలుపును బ్లాక్ చేసింది.
దీంతో షాక్ అయిన ఉద్యోగులు ఏం చేయాలో తెలియక నోరెళ్లబెట్టారు.
స్టీఫెన్స్ సహాయం కోసం 911కి డయల్ చేశారు.ఈ గందరగోళం మధ్య లీసా అనే మరో ఉద్యోగినికి ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది.ఎలుగుబంటిని భయపెట్టాలనే ఉద్దేశంతో ఆమె తన కారును బేకరీ ( Bakery ) ముందు భాగానికి నడపాలని.
హారన్ మోగించాలని నిర్ణయించుకుంది.చివరగా, ఎలుగుబంటిని గ్యారేజ్ నుంచి ఎలాగోలా బయటికి పంపించగలిగారు.
స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పరిస్థితిని పరిష్కరించడానికి అక్కడివారు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ (DEEP)తో కలిసి పనిచేశారు.అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఎలుగుబంటి 60 కంటే ఎక్కువ కప్‌కేక్‌లు, కొన్ని కోకొనట్ కేక్‌లను తన కడుపులో వేసేసుకుంది.అయితే ఉద్యోగులలో ఎవరూ కూడా ఎలుగుబంటి వల్ల గాయపడలేదు.ఏది ఏదైనా ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.