చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు జరిగే కొన్ని సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి అయోమయానికి గురి చేస్తూ ఉంటాయి.ఇలా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో జరిగాయని చెప్పాలి.
ఎంతోమంది సినీ నటీనటుల మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మారిపోయాయి ఇలాంటి మిస్టరీగా ఉన్నటువంటి వాటిలో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులు కూడా ఒకటి చెప్పాలి.దాదాపు 20 సంవత్సరాల క్రితం బాలకృష్ణ( Balakrishna ) ఇంట్లో సురేష్ బాబు ( Suresh Babu ) జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిలపై పెద్ద ఎత్తున కాల్పులు జరిగిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ కాల్పులు( Gun Shoot ) జరిగిన సమయంలో అసలు బాలకృష్ణ వీరిపై కాల్పులు జరపడానికి కారణం ఏంటి అసలు ఈ కాల్పులు ఎందుకు జరిగాయి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఇలా ఈ ఘటన జరిగి 20 సంవత్సరాలు అవుతున్న ఇందుకు ఈ ఘటన జరిగిందన్న విషయం గురించి ఎవరికీ క్లారిటీ లేదు అయితే తాజాగా బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ ( Bellamkonda Ganesh ) ఒక ఇంటర్వ్యూలో ఈ ఘటన గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.

బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్టూడెంట్ సర్ ( Student Sir ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జూన్ రెండో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బెల్లంకొండ గణేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన గత 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కాల్పుల ఘటన గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినప్పుడు తనకు నిండా పదేళ్లు కూడా లేవని తెలిపారు.
ఈ ఘటన ఎందుకు జరిగింది ఏంటి అనే సంఘటన నాకు ఏమాత్రం గుర్తు లేదని అయితే ఈ ఘటన గురించి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ కూడా నాన్నని అడిగే ప్రయత్నం చేయలేదని తెలిపారు.ఇప్పుడు ఈ కాల్పుల ఘటన గురించి నాన్నని అడిగి తెలుసుకున్న ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, ఈ ఘటన గురించి ప్రశ్నించలేదని బెల్లంకొండ గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







