ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”( Adipurush ).ప్రభాస్ హీరోగా, కృతి సనన్( Kriti Sanon ) హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో ప్రభాస్ ( Prabhas )రాముడి పాత్రలో నటించగా.
కృతి సనన్ సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.
సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.

ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ జై శ్రీరామ్ తో మరిన్ని అంచనాలు క్రియేట్ చేసి పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేసారు.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇందు కోసం తాజాగా డేట్ కూడా ఫిక్స్ చేసి అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
ఈ సినిమా రిలీజ్ కు మరి కొద్దీ రోజులే ఉండగా మరో సాంగ్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ను మే 29న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.”రామ్ సియా రామ్” అనే సాంగ్ కోసం ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి మొదటి సాంగ్ ను మించి ఉంటుందో లేదో చూడాలి.
ఇక జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.







