2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ( Janasena )రాజకీయ వ్యూహం ఏంటో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతానికి బీజేపీతో ( BJP )జనసేన పొత్తులో ఉన్న విషయం తెల్సిందే.
ఎన్నికల సమయంకు తెలుగు దేశం పార్టీ( TDP Party ) తో కూడా కలిసే అవకాశాలు లేకపోలేదు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది.
అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండాలని పవన్ భావిస్తున్నాడు.జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పొత్తులు ఉంటాయి అంటూ పలు సందర్భాల్లో ప్రకటించాడు.
తాజాగా పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే పవన్ మూడు వేరు వేరు సర్వేలు చేయించాలని భావిస్తున్నారట.మూడు విధాలుగా జరుగబోతున్న ఆ సర్వేలో జనసేన బలం ఏంటి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
ప్రతి సర్వేలో కూడా జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటి… బీజేపీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.టీడీపీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయాలను సర్వే చేయబోతున్నారట.
ఆ విషయమై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే విధంగా సర్వే లు చేయించబోతున్నారు.
2019 ఎన్నికలతో పోల్చితే పవన్ కళ్యాణ్( Pawan kalyan ) జనసేన పార్టీ బలోపేతం అయ్యింది.కనుక కచ్చితంగా జనసేన పార్టీ నాయకులు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా కూడా గౌరవ ప్రథమైన సీట్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.కనుక పవన్ కళ్యాణ్ సర్వే లు చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.
సర్వే ఫలితాలను బట్టి పొత్తుల విషయమై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఒక వేళ పొత్తులు పెట్టుకుంటే ఎన్ని సీట్లు డిమాండ్ చేయాలి అనే విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పవన్ టీమ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే 75 సీట్లను డిమాండ్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒకవేళ అదే నిజమైతే కచ్చితంగా టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.