ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jaganmohan Reddy ) ఈరోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు.సీఎంకు వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, భరత్ ఘన స్వాగతం పలకడం జరిగింది.

 Ap Cm Jagan Reached Delhi , Ap Cm Jagan, Delhi , Minister Nirmala Sitharaman, Ys-TeluguStop.com

సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్( Minister Nirmala Sitharaman ) తో సీఎం జగన్ సమావేశం కానున్నారు.రేపు నీతి అయోగ్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.

ఎల్లుండా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు.

నీతి అయోగ్ సమావేశాన్ని అదేవిధంగా కొత్త పార్లమెంట్( New Parliament ) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించడం జరిగాయి.నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని రాజ్యాంగ ప్రకారం రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోడీ( Prime Minister Modi ) ప్రారంభించడాని వ్యతిరేకించడం జరిగింది.రాజ్యాంగానికి అధిపతి అయిన రాష్ట్రపతి చేతుల మీదగా ప్రారంభోత్సవం జరగాలని పట్టుపట్టాయి.

దీంతో 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.అయితే మరో పక్క ఈ కార్యక్రమాన్ని చాలా పార్టీలు స్వాగతించడం జరిగాయి.

ఇదే సమయంలో సీఎం జగన్ సైతం స్వాగతించి నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తన ఎంపీలతో కలిసి పాల్గొనబోతున్నట్లు మొన్ననే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఈ క్రమంలో నేడు సీఎం జగన్ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube