తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను 20 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది.
రాష్ట్ర అవతరణ వేడుకలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను ఆహ్వానించనున్నట్లు మధు యాష్కీ తెలిపారు.జూన్ 2న అన్ని మండల కేంద్రాల్లో సోనియాగాంధీకి పాలాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం పార్లమెంట్ ప్రారంభోత్సవంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పార్లమెంట్ ఓ దేవాలయం అని చెప్పారు.అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావడం లేదని తెలిపారు.