కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది.రాహుల్ గాంధీకి పాస్ పోర్ట్ జారీపై ఎటువంటి అభ్యంతరం లేదని న్యాయస్థానం తెలిపింది.
ఎన్ఓసీ మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.అయితే ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో దౌత్య పాస్ పోర్ట్ ను సరెండర్ చేశారు రాహుల్ గాంధీ.
ఈ నేపథ్యంలోనే సాధారణ పాస్ పోర్ట్ జారీకి ఎన్ఓసీ కోరుతూ రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.







