ఈ శుక్రవారం టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు రెండు సినిమాలు వచ్చాయి .అందులో ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిన్న చిత్రం మేమ్ ఫేమస్ ఒకటి .
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh babu )సైతం ఈ చిత్రాన్ని చూసి ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చారు.
మేమ్ ఫేమస్ బ్రిలియంట్ ఫిలిమ్.సుమంత్ ప్రభాస్ అద్భుతంగా నటించి దర్శకత్వం చేశారు అంటూ మహేష్ ప్రశంసలు కురిపించారు.మహేష్ బాబు ట్వీట్ చేయడంతో మేమ్ ఫేమస్ మూవీపై బజ్ మరో స్థాయికి చేరింది.మహేష్ ట్వీట్ పై ఈ చిత్ర నిర్మాత స్పందిస్తూ.
మీ బ్యానర్ లో సుమంత్ ప్రభాస్( Sumanth Prabhas) హీరోగా ఓ సినిమా చేద్దాం అని చెప్పేశారు.ఒక చిన్న చిత్రానికి మహేష్ బాబు ట్వీట్ చేయడం బాగానే ఉన్నా .కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చడం లేదు.

మరికొంతమంది గీతా ఆర్ట్స్ ప్రమోషన్స్ స్ట్రాటజీలో ఇది ఒక భాగం అని అంటున్నారు.వాళ్లే మహేష్ అకౌంట్ చేత ట్వీట్ వేయించుకుని పబ్లిసిటీ పొందుతున్నారు.అసలు ఈ చిత్రాన్ని మహేష్ బాబు చూసే ఉండరు అని అంటున్నారు.
మరికొందరు నెటిజన్లు అయితే మహేష్ ని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.నేడు మేమ్ ఫేమస్ తో పాటు నరేష్ మళ్ళీ పెళ్లి కూడా రిలీజ్ ఉంది.

నరేష్, పవిత్ర మళ్ళీపెళ్లి చిత్రం ఎంత రచ్చ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు .దీనితో ముడిపెడుతూ మహేష్ ని ట్రోల్ చేస్తున్నారు.మాకు మళ్ళీ పెళ్లి రివ్యూ కావాలి మహేష్ గారు.మీరు వేయకపోయినా మీ సోషల్ మీడియా టీం వేస్తారులే అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
మళ్ళీపెళ్లి( Malli Pelli ) రివ్యూ ఒకటే బ్యాలెన్స్ ఇక అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.ఒక్కడు లాంటి సినిమా ఇచ్చిన ఎమ్మెస్ రాజు( M.S.Raju ), ఫ్యామిలీ మెంబర్ నరేష్ కోసం అయినా మీరు మళ్ళీపెళ్లి రివ్యూ ఇవ్వాలి అని కొందరు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.తరచుగా మహేష్ బాబు చిన్న చిత్రాలని ప్రోత్సహిస్తూ ట్వీట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.అయితే ఈసారి టైమింగ్ మిస్ అయినట్లు ఉంది.సడెన్ గా మేమ్ ఫేమస్ కోసం ట్వీట్ చేయడం.పక్కనే నరేష్ మళ్ళీ పెళ్లి( Malli Pelli ) కూడా ఉండడంతో మహేష్ ట్వీట్ ట్రోలింగ్ కి స్టఫ్ గా మారింది.
ఆ మధ్యన నరేష్ మాట్లాడుతూ.పవిత్రతో నా రిలేషన్ ని మహేష్ బాబు యాక్సెప్ట్ చేశారు అని కూడా కామెంట్స్ చేశారు .ఇక ఇదే సమయంలో మేము ఫెమస్ నిజంగా మహేష్ చూశాడా అనేది కీలకంగా మారింది .








