తండ్రి మెగాస్టార్ చిరంజీవి( Megastar chiranjeevi ), బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి తగ్గ నటనతో గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ స్థాయి పెరిగిందని చెప్పొచ్చు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ తన క్రేజ్ ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు.ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నారు రాబోవు రోజుల్లో హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం చరణ్, శంకర్( Ram charan, Shankar ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని ఉంటాయి ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకున్నట్లు తెలుస్తోంది.కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్లో తీసుకురాబోతున్నారు.ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయనున్నట్టు సమాచారం.
ఇక హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన చెర్రీ.చైల్డ్ ఆర్టిస్ట్‌గా( Child Artist ) ఓ సినిమాలో కనిపించారనేది చాలా తక్కువ మందికి తెలుసు .ఇప్పుడిదే విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది.మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే చరణ్ బాలనటుడిగా ఓ సినిమాలో నటించారని తెలుస్తుంది .

చిన్నప్పుడు ఎంతో క్యూట్‌గా ఉండే చరణ్ అప్పుడే వెండితెరపై సందడి చేశాడు కానీ ఆ సినిమాలోని చరణ్ సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని తెలుస్తుంది చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో చరణ్ ఓ సన్నివేశంలో నటించారు .దాసరి నారాయణరావు, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది.ఇది దాసరికి కెరీర్ పరంగా 100వ సినిమా.ఇందులో చరణ్ ఓ సీన్‌లో నటించాడు.
తండ్రితో పాటు ఉన్న వర్కింగ్ స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.అయితే సినిమా అంతా అయిపోయాక ఎడిటింగ్ టేబుల్ మీద చూసుకుంటే అతికించినట్లు ఉండటంతో ఆ సన్నివేశం తీసేసారు .ఆ సీన్ అలాగే ఉంచి ఉంటే రామ్ చరణ్ తొలి సినిమా లంకేశ్వరుడు అయ్యుండేది.ఆ తర్వాత ఇంకెప్పుడు బాల నటుడిగా చరణ్ నటించలేదు.21 ఏళ్ళ వయసులో చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రా.ఆ తర్వాత అప్రతహతంగా దూసుకుపోతున్నాడు.ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నాడు .