ఆ హైవేపైనుండి ఏకంగా 14 దేశాలు చుట్టి రావచ్చు... అతిపెద్ద హైవే అదే!

ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసిందే.అయితే అలాంటి రోడ్లు మీద సరాసరి వేరే దేశాలకు కూడా పయనించొచ్చనే విషయం ఎంతమందికి తెలుసు? మనదేశంలోని అతిపెద్ద రోడ్డు నేషనల్ హైవే-44( National Highway 44 ).ఇది దాదాపు 3,745 కిలోమీటర్ల దూరం కలిగి వుంది.ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ వ్యాపించి ఉంటుంది.

 14 Countries Can Be Crossed From That Highway... The Biggest Highway Is That! ,-TeluguStop.com

అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని మీరు ఎపుడైనా ఊహించారా? ఇక దానిపై పయనిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే విషయం మీకు తెలుసా.

Telugu Biggest Highway, Alaska, Argentina, Darien Gap, Highway, Panamerica-Telug

ఉత్తర అమెరికా – దక్షిణ అమెరికాలను కలిపే ‘పాన్ అమెరికా హైవే‘ ప్రపంచంలోనే అతి పెద్ద రహదారిగా గుర్తింపు సాధించింది. అలస్కా( Alaska )లో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది.2 మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో బీజం పడింది.ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తుండడం కొసమెరుపు.కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదంటే మీరు నమ్ముతారా.

Telugu Biggest Highway, Alaska, Argentina, Darien Gap, Highway, Panamerica-Telug

ఈ భాగాన్ని ‘డారియన్ గ్యాప్( Darien Gap )’ అని అంటారు.ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది.కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్‌, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారనుండడంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమం మాత్రమే అనుసరిస్తారు.ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు.

కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టేయగా అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది.ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు.

ఇక ఆ 14 దేశాలు ఇవే:

1.యునైటెడ్‌ స్టేట్స్‌ 2.కెనడా 3.మెక్సికో 4.గ్వాటెమాల 5.ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7.నికరాగ్వా 8.కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11.ఈక్వెడార్ 12.పెరూ 13.చిలీ 14.అర్జెంటీనా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube