చర్మం ఎంత నల్లగా ఉన్నా సరే ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే పది రోజుల్లో వైట్ గా మారుతుంది!

సాధారణంగా కొందరికి బాడీ మొత్తం తెల్లగా ఉన్నా సరే ముఖం ( Face ) మాత్రం కాస్త రంగు తక్కువగా ఉంటుంది.ఎండల ప్రభావం, మృత కణాలు పేరుకుపోవడం, రసాయనాలు అధికంగా ఉండే మేకప్ ఉత్పత్తులను వాడటం తదితర కారణాల వల్ల ముఖ చర్మం నల్లగా మారుతుంటుంది.

 Simple Home Remedy For Skin Whitening Details, Home Remedy, Skin Whitening Remed-TeluguStop.com

దాంతో మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీములు కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.

ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ రెమెడీ మాత్రం ఎంత నల్లగా ఉన్నా సరే మీ ముఖ చర్మాన్ని పది రోజుల్లో వైట్ గా మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న బంగాళదుంపను ( Potato ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Multhani Mitti, Potatoes, Rose, Skin Care, Skin Car

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి.ఇర‌వై నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Multhani Mitti, Potatoes, Rose, Skin Care, Skin Car

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.చర్మం కొద్ది రోజుల్లోనే తెల్లగా మారుతుంది.అలాగే చర్మంపై ఏమైనా మొండి మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.ఆయిలీ స్కిన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

చర్మం యవ్వనంగా మెరుస్తుంది.సహజంగానే తెల్లగా, అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube