తెలంగాణ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేసిన బిజెపి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 ఎమ్మెల్యే సీట్లు తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కర్ణాటక( Karnataka ) ప్రభావం తెలంగాణ పై పడకూడదని సర్వశక్తులు ఒడ్డుతుంది.తమ బలహీనతలన్నీ జయించి, బలాన్ని కూడగొట్టుకునే పనిలో పడింది తెలంగాణలో భాజపా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నేతల మధ్య సమన్వయ లోపం.
ఎవరికి వారు విడిగా ప్రయత్నించడమే తప్ప కలిసికట్టుగా ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో తెలంగాణ నాయకులు ఉన్నారు.కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ,వారానికి ఒకసారి సమావేశాలు పెట్టుకొని ఓపెన్ డిస్కషన్ చేసుకోవాలని అమిత్ షా సూచించినా కూడా పెడ చెవిన పెట్టిన నాయకులు తలో దిక్కులోరాజకీయాలు చేస్తున్నారు.
పార్టీ నాయకుల మధ్య పని విభజన జరిగి ,బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తే మిషన్ 90 టార్గెట్ ని సాధించడం ఏమంత కష్టం కాదని బిజెపి భావిస్తుంది .

ఇప్పుడు దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది .తెలంగాణ బిజెపికి కీలక నేతలు అయిన ఈటెల రాజేందర్ ,ఇటీవల పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి సీనియర్లకు కొత్త బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని చూస్తుంది, చేరికలు కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటెల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ ప్రచార కమిటీ పగ్గాలు కూడా అప్పగించాలని చూస్తుందని తెలుస్తుంది.ఆ దిశగా ఇప్పటికే ఈ ముగ్గురు నేతలతో సమావేశమైన అమిత్ షా పార్టీ బలోపేతంపై చర్చించారట .

ఇటీవల తన పర్యటన ముగించుకుని వచ్చి రాష్ట్రానికి వచ్చిన ఈటెల రాజేందర్( ( Etela Rajender ) ) పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పడం బట్టి పార్టీలోకి నాయకులను ఆకర్షించే ప్లాన్ మొదలుపెట్టారని అర్థమవుతుంది తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi sanjay ) శక్తి మేరకు పని చేస్తున్నారని ఆయనను సమర్థించుకొచ్చిన ఈటెల ,పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్లాలంటే మాత్రం కొత్త నాయకుల అవసరం కచ్చితంగా ఉందని తేల్చేశారు ….ఎన్నికలకు తక్కువ సమయమే ఉన్నందున సాధ్యమైనంత మంది కీలకమైన నేతాలను ఈ లోపు పార్టీలోకి ఆకర్షించే గెలుపు గుర్రాలుగా మార్చాలని ఆ పార్టీ భావిస్తుంది.







