హైదరాబాదులో( Hyderabad ) దారుణం చోటు చేసుకుంది.హయత్ నగర్( Hayat Nagar ) లెక్చరర్స్ కాలనీలో విషాదం సంభవించింది.
కారు కిందపడి రెండున్నరేళ్ల చిన్నారి లక్ష్మి( Child Lakshmi ) మృతి చెందింది.సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
సెల్లార్ లో కార్ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బాలుడు కారు టైరు కింద పడి చిక్కుకున్నాడు.అయితే ఈ విషయం డ్రైవర్ గమనించకపోవడంతో టైర్ కింద నలిగిపోయాడు.
దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వెంటనే ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించి కేసు నమోదు చేయడం జరిగింది.చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మంగళవారం సరిగ్గా ఇదే తరహా ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
బొజ్జ గూడెం గ్రామంలో పెళ్లి జరుగుతుండగా పెళ్లి వేడుకల్లో జరుగుతున్న బరత్ ను చూడటానికి ఇంద్రజానే 9 ఏళ్ల చిన్నారి కిటికీలోంచి తల బయటకు పెట్టింది.ఈ క్రమంలో డ్రైవర్ శేఖర్ దీనిని గమనించకుండా కారు విండో గ్లాస్ పైకెత్తాడు… ఈ క్రమంలో చిన్నారి మేడ ఇరికిపోవటంతో.
ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది