సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ(Manchu Family) కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.మంచు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో విష్ణు(Vishnu) ఒకరు.
ప్రస్తుతం మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక మంచు విష్ణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ పలు విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం 2000 నోట్లు బ్యాన్ చేసిన నేపథ్యంలో ఈయన 2000 నోట్ల కట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవన్నీ వెన్నెల కిషోర్(Vennela Kishore) ఇంట్లో కనిపించాయి అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నిజంగానే వెన్నెల కిషోర్ ఇంట్లో నోట్ల కట్ల ఉన్నాయా ఇప్పుడు వాటిని ఏం చేస్తారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేశారు.అలాగే మరికొందరు మంచు విష్ణు సరదాగా ఈ పోస్ట్ చేశారని కూడా భావించారు.అయితే ఈ పోస్ట్ ను కొందరు సీరియస్ గా తీసుకోడంతో మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి.
వెన్నెల కిషోర్ ఇంట్లో నిజంగానే నోట్ల కుప్పులున్నాయని అంతా అనుకున్నారు.ఇక ఈ ట్వీట్ పై మంచు విష్ణు(Manchu Vishnu) స్పందించాడు.

ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొందరు మీడియా మిత్రులు నేను వెన్నెల కిషోర్ గురించి వేసిన జోక్ ను డిఫరెంట్ గా తీసుకున్నారు.అది జోక్ అని అందరికీ తెలిసిందే.కొంచమైనా కళా పోషణ ఉన్నవారికి ఈ జోక్ తప్పకుండా అర్థమవుతుందని, అది జోక్ అని అర్థం కాని వాళ్ళను ఆ దేవుడే కాపాడాలి అంటూ ఈ సందర్భంగా మంచు విష్ణు క్లారిటీ ఇస్తూ చేస్తున్నటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.







