ఓఆర్ఆర్ లీజు వ్యవహారంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఓఆర్ఆర్ ను అప్పనంగా ప్రైవేట్ కు అప్పగించారన్నారు.
టెండర్లు దక్కించుకున్న కంపెనీలు డబ్బులు చెల్లించాలని తెలిపారు.
నిబంధనల ప్రకారం 30 రోజుల్లో పది శాతం నిధులు చెల్లించకపోతే టెండర్ రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎల్లుండిలోగా ఓఆర్ఆర్ వ్యవహారంపై అర్వింద్ కుమార్ వివరణ ఇవ్వాలన్నారు.పది శాతం కూడా నిధులు చెల్లించలేని ఐఆర్బీ డెవలపర్స్ కు ఓఆర్ఆర్ ను ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.కేబినెట్ కూడా పరిమితికి లోబడే పని చేయాలని సూచించారు.







