తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి.దీనిలో భాగంగానే కాంగ్రెస్ కూడా పాదయాత్రలు చేపట్టి జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తుండగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రని నమ్ముకున్నారు.పాదయాత్ర ద్వారానే ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇదొక్కటే మార్గమని కాంగ్రెస్ తెలంగాణ నేతలంతా బలంగా ఫిక్స్ అయిపోయారు.
ఈ నేపథ్యంలో నే కాంగ్రెస్( Congress ) సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy )సైతం ఇప్పుడు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వెంకటరెడ్డి ప్రకటించారు.ముఖ్యమంత్రి పదవిపై తాను ఆశలు పెట్టుకోవడం లేదని , రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 నుంచి 80 సీట్లు గెలుచుకోగలదని వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే రాష్ట్రమంతా పర్యటిస్తానని వెంకటరెడ్డి చెబుతున్నారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద కృష్ణ జలాలకు పూజలు చేసిన అనంతరం వెంకటరెడ్డి మాట్లాడారు .ఈ సందర్భంగా వెంకటరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున సీఎం సిఎం అంటూ నినాదాలు చేశారు .దీనిపై స్పందించిన ఆయన ” కేవలం నినాదాలతో నేను ముఖ్యమంత్రిని కాలేను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ సంప్రదించిన తర్వాత హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుంది.నా ప్రాధాన్యత సీఎం పదవి కాదు, ప్రజల సంక్షేమం రాష్ట్ర సాధన కోసం నా మంత్రి పదవిని త్యాగం చేశాను” అంటూ వెంకటరెడ్డి అన్నారు.
అలాగే నల్గొండ జిల్లాలో భారీగా నిర్వహించే బహిరంగ సభకు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ హాజరవుతారని వెంకటరెడ్డి చెబుతున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఎవరికి వారు పాదయాత్రలు చేపడుతూ తమ ప్రాధాన్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోని వెంకటరెడ్డి సైతం పాదయాత్రని నమ్ముకుని జనాల్లో తన బలం నిరూపించుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను పరిగణలోకి అధిష్టానం తీసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు ప్రస్తుతం మల్లు భట్టు విక్రమార్క ( Mallu Bhatti Vikramarka )రేవంత్ రెడ్డి తదితరుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వెంకట్ రెడ్డి వీరిపై పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.