ఈమధ్య జబర్దస్త్ షో ( Jabardasth Show )అంటే చాలు అక్కడ కామెడీ కంటే కూడా ఆందులో పాల్గొనే నటుల మద్య ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయి అని చాలా కామెంట్లు వస్తున్నాయి.వాటిని షో యాజమాన్య పబ్లిసిటీ కొసం వాడుకుంటున్నారు మొన్నటికి మొన్న సుధీర్ రేష్మి( Sudhir Reshmi ) లు వార్తల్లో నిలిస్తే ఇక వాళ్ల తర్వాత ఇమన్యుల్ వర్ష మద్య ఏదో ఉంది అంటూ చాలా వార్తలు వచ్చాయి…ఇక వీళ్ళ కంటే ముందే పటాస్ షో( Patas Show ) లో చేస్తున్న ప్పటి నుంచే వాటిలో ప్రవీణ్-ఫైమా లవ్ ట్రాక్ కూడా ఒకటి ఉండేది…వీళ్లు పెళ్లి చేసుకుంటారని కూడా బాగానే దంచికొట్టారు .
తీరా చూస్తే ఇప్పుడు ప్రవీణ్ పెళ్లి చేసుకున్న వీడియో పోస్ట్ చేసేసరికి.నెటిజన్లు తట్టుకోలేకపోయారు.
ఫైమానే మోసం చేస్తావా, అమ్మాయిల జీవితంతో ఆడుకుంటావా అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు.ఇక ఇంకొంతమంది అయితే ఫైమానే ప్రవీణ్‌ను వదిలేసింది, బీబీ జోడి( Bb Jodi ) గెలిచిన తర్వాత ప్రవీణ్‌ను మర్చిపోయింది, డబ్బు వస్తే అంతే అంటూ ఫైమాను కూడా ఓ రేంజ్‌లో తిట్టారు.అంతక ముందు బిగ్ బాస్ షో( Bigg Boss Show ) వేదికపై ఫైమా.ప్రవీణ్ అంటే తనకు ఇష్టమని వెల్లడించింది .కష్టాల్లో తనకు తోడున్న ఒకే ఒక వ్యక్తి ప్రవీణ్ అని ఫైమా చెప్పారు.హౌస్ నుండి బయటకు రాగానే ప్రవీణ్ ఫైమాను కలిశాడు.
ఆమెకు ప్రేమగా బహుమతులు అందించారు.అయితే అనుహ్యంగా ఫైమాకు షాక్ ఇస్తూ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు వీడియో బయటకు రావడంతో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి .
దీనితో ప్రవీణ్ స్పందించాడు.అదంతా కొమరం యూట్యూబ్ ఛానల్( Komaram YouTube Channel ) కోసం చేసిన వీడియో అని క్లారిటీ ఇచ్చాడు .నిజంగా నాకు వివాహం కాలేదని క్లారిటీ ఇచ్చాడు.దీంతో ఫైమా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రవీణ్ ఫైమా ఎప్పటికైనా ఒకటే.వారు ఒకరినొకరు మోసం చేసుకోరని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అత్యంత పేదరికంలో పుట్టిన ఫైమా స్వశక్తితో ఎదిగింది.జబర్దస్త్ కామెడీ షో ఫైమాకు లైఫ్ ఇచ్చింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఫైమా ఇల్లు కూడా కొన్నది .దాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయించడానికి ఇంకా కొంత డబ్బు అవసరమని చెప్పింది.ఇక ప్రవీణ్ పటాస్ షో వేదికగా పాపులారిటీ తెచ్చుకున్నాడు.కొన్నాళ్లుగా జబర్దస్త్ షోలో చేస్తున్నాడు.వీరిద్దరూ ఏకం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు .