ఏదైనా అర్జెంట్ మీటింగ్ లేదా ఇష్టమైన వారితో డేటింగ్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖ చర్మం డల్ గా ఉంటే బయటకు వెళ్ళాలి అన్న మూడు, ఉత్సాహం రెండు పోతాయి.ఎక్కడ లేని నిరుత్సాహం మొత్తం మనలోనే నిండిపోతుంది.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే కేవలం పది నిమిషాల్లో మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.ముఖం లో డల్ నెస్ మొత్తం ఎగిరిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక టమాటో( Tomato) ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి టమాటో జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffe powder ), రెండు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్, నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడర్ వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు హిట్ చేయాలి.ఆపై ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి అప్పుడు ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మాస్క్ లా అప్లై చేసుకోవాలి.
పది నిమిషాల అనంతరం ఫేస్ మాస్క్ ను తొలగించాలి.
ఇలా చేస్తే చర్మం పై పేరుకుపోయిన డస్ట్ పార్టికల్స్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.ముఖ చర్మం శుభ్రంగా, కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.ముఖంలో డల్ నెస్ అనేది కనిపించదు.
ముఖంలో కొత్త మెరుపు వస్తుంది.కాబట్టి ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ మరియు ఎట్రాక్టింగ్ ముఖ చర్మాన్ని పొందాలని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.