మలయాళ నటుడు ఉన్ని ముకుందన్( Unni Mukundan ) గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల మాలికాపురం సినిమాతో( Malikapuram Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఉన్ని ముకుందన్ గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపుల కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఉన్ని ముకుందన్‌కు హైకోర్టు ( Kerala High Court ) ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

ఈ కేసు పై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది.ఈ కేసులో ఫిర్యాదుదారుతో సెటిల్‌మెంట్ కుదిరిందని ఊహగానాలు కూడా వినిపించాయి.అయితే తనను కోర్ట్ నిర్దోషి అని ప్రకటిస్తుందని ఉన్ని ముకుందన్ ఆశతో ఉండగా తాజాగా హైకోర్టు ఇలా ఊహించని షాక్ ఇచ్చింది.
కాగా 2017 లో ఆగస్టు 23న సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్ తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబరు 15, 2017లో పోలీసులకి ఫిర్యాదు చేసింది.అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు.

అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు.సెటిల్‌మెంట్ లో ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు.ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే ఆయనకు కోర్టుల్లో ఊహించని షాక్ ఎదురైంది.దీంతో నటుడు తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాడు.
ఒకవైపు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.ప్రస్తుతం ఉన్ని ముకుందన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.







