బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).ఇక ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ భారీగా పెరిగింది.అయితే వరుస ప్లాప్స్ వస్తున్నాయి.బాహుబలి తర్వాత మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోలేదు.అయినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.
మరి డార్లింగ్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా కూడా ఉంది.
ఇది ఈయన మిగతా ప్రోజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా కేవలం రిలీజ్ తర్వాత ప్రాఫిట్స్ లో వాటా మాత్రమే తీసుకో బోతున్నాడు.
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ”రాజా డీలక్స్” (Raja Deluxe) చేస్తున్నాడు.ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ కూడా రాలేదు.కానీ ఈ సినిమా షూట్ మాత్రం పూర్తి అవుతుంది.ఇప్పటికే సగానికి పైగానే పూర్తి అయినట్టు టాక్.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వైరల్ అయ్యింది.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) సంగీతం అందిస్తున్నట్టు లేటెస్ట్ గా న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రభాస్ మంచి స్టైలిష్ లుక్ లో అలరించబోతున్న ఈ సినిమాకు థమన్ సూపర్ ట్యూన్స్ రెడీ చేసే పనిలో ఉన్నారట.ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్ గా కనిపిస్తుంది.మొత్తానికి మారుతి ప్రభాస్ తో ఎలా ప్లాన్ చేస్తున్నాడో అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను 100 కోట్ల లోపులోనే పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.







