యాంకర్ సుమ(Suma) పరిచయం అవసరం లేని పేరు గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా ఏకచత్రాధిపత్యం వహిస్తున్నటువంటి సుమ ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లో బుల్లితెర కార్యక్రమాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతో ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ కోసం ఎంతోమంది సినీ నిర్మాతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు.
ఏదైనా ఒక సినిమా వేడుక జరిగింది అంటే తప్పకుండా ఆ వేడుకలో సుమ యాంకర్ గా వ్యవహరించాల్సిందే.ఇలా ఈమె చేత యాంకరింగ్ చేస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందన్న ఆలోచనలో కూడా నిర్మాతలు ఉన్నారు.
అందుకోసమే సుమ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు.

ఇలా సుమా యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈమె మరోవైపు యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) రన్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండటమే కాకుండా నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.అలాగే సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రొడక్ట్స్ ని కూడా ఈమె ప్రమోట్ చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.
తాజాగా సుమ ఫుడ్(Food), పికిల్స్ (Pickels) ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేశారు.అందులో రాజీవ్ కనకాల(Rajeev Kanakala) కూడా ఉండడం విశేషం.

ఇలా సుమ ఈ పచ్చళ్ళను ఫుడ్ ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ వీడియో చేయడంతో భారీగా నేటిజన్స్ ట్రోలింగ్ కు గురవుతున్నారు.ఇదివరకే ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ మేము ఉపయోగించామని చాలా చెత్తగా ఉన్నాయి.పెద్దగా రుచి కూడా లేవు అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.అలాగే పికిల్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని, డెలివరీ అయ్యే లోపు కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ పాడైపోతున్నాయి అంటూ సుమా చేసిన వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విధంగా సుమ ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్ కు నెగిటివ్ రివ్యూలు ఇచ్చినప్పటికీ వాటిని ప్రమోట్ చేయడంతో డబ్బు కోసమే సుమ ఇలా చేస్తున్నారని పెద్ద ఎత్తున ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.ఇప్పటివరకు భారీగానే డబ్బు సంపాదించావు కదా సుమ ఇలాంటి వాటిని కూడా ప్రమోట్ చేస్తూ పరువు తీసుకోవడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.







