Samantha: ఆ స్టార్ సింగర్ భర్త గురించి షాకింగ్ నిజం బయటపెట్టిన సమంత.. అతనికి ఆ అలవాటు కూడా ఉందా?

ఈ మధ్య సమంత( Samantha ) సోషల్ మీడియాలో ఏది షేర్ చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది.అంతేకాకుండా తన వ్యక్తిగత విషయంలో కూడా బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

 Samantha Revealed The Shocking Truth About Singer Chinmayi Husband Rahul Ravind-TeluguStop.com

తన భర్త నాగచైతన్యను విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.ఇక విడాకుల డిప్రెషన్లో సోషల్ మీడియాలో కొన్ని జీవిత సత్యాలు తెలిపి అందరి దృష్టిలో పడింది.

దాంతో చాలా వరకు తను సోషల్ మీడియా ద్వారానే రిఫ్రెష్ అయింది.విడాకుల గురించి ఎన్ని వార్తలు వచ్చినా కూడా పట్టించుకోకుండా వచ్చిన సినిమాలను ఓకే చేస్తూ ఏ పాత్ర అని ఆలోచించకుండా చేయటానికి సిద్ధమైంది.

కానీ విడాకుల తర్వాత సమంతకు సినిమాలపరంగా సరైన సక్సెస్ రాలేకపోతుంది.దానికి అసలైన కారణం ఏంటో తెలియదు కానీ నాగచైతన్య మీద కోపంతో ఎటువంటి కంటెంట్ అయిన చేయటానికి సిద్ధపడటంతో తనకు సక్సెస్ రాలేక పోతుంది అని అంటున్నారు కొంతమంది జనాలు.

Telugu Chinmayi Rahul, Kushi, Naga Chaitanya, Rahul Ravindran, Samantha, Shaakun

రీసెంట్ గా విడుదలైన శాకుంతలం సినిమా( Shaakuntalam ) మాత్రం సమంతను బాగా నిరాశపరిచిందని చెప్పాలి.అయినప్పటికీ కూడా సమంత యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంది.సోషల్ మీడియాలో కూడా వరుస పోస్టులు షేర్ చేస్తూ బాగా చిల్ అవుతుంది.అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.ఇక విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాల్లో కూడా చేస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది.అందులో.‘పెళ్లిలో ఈ కాన్సెప్ట్ ఏంటో అసలు అర్థం కాదు.భోజనం చేసి వెళ్లండి. బ్రో! నేను వచ్చిందే తినడానికి’ అనే ఒక లైన్ ను పంచుకుంటూ.హీరో రాహుల్ ను( Rahul Ravindran ) ట్యాగ్ చేసి ప్రతి పెళ్లిలో ఆయన ఇలాగే చేస్తాడు అన్నట్లుగా ఆయన గురించి షాకింగ్ విషయం బయట పెట్టింది.

Telugu Chinmayi Rahul, Kushi, Naga Chaitanya, Rahul Ravindran, Samantha, Shaakun

ఇంతకీ రాహుల్ ఎవరో కాదు.స్టార్ సింగర్ చిన్మయి( Singer Chinmayi ) భర్త.రాహుల్ రవీంద్రన్ కూడా టాలీవుడ్ లో కొంతకాలం హీరోగా చెయ్యగా ఇప్పుడు గా దూరంగా ఉంటున్నాడు.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా నటించాడు రాహుల్.ఇక ఈయన సింగర్ చిన్మయి ని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.అయితే చిన్మయి సమంతకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి.

Telugu Chinmayi Rahul, Kushi, Naga Chaitanya, Rahul Ravindran, Samantha, Shaakun

సమంత కు డబ్బింగ్ గా చేస్తుంది చిన్మయి.అలా వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడగా రాహుల్ కూడా సమంతతో మంచి ఫ్రెండ్ గా కనిపిస్తూ ఉంటాడు.వీరు పలు సందర్భాలలో కలిసి దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక రాహుల్ తనకు క్లోజ్ కాబట్టి సరదాగా అతనిని ట్యాగ్ చేసి అలా పోస్ట్ షేర్ చేసింది సమంత.ఇక ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube