శరత్ బాబుకు వారసులు లేకపోయినా... ఆస్తి తగాదాలు తప్పలేదా?

సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) అనారోగ్య సమస్యలతోబాధపడుతూ నేడు మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈయన హైదరాబాద్లోనో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు.

 Even If Sarath Babu Has No Heirs Property Disputes Are Inevitable Details, Sarat-TeluguStop.com

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి శరత్ బాబు ఇదివరకు బెంగళూరులో ట్రీట్మెంట్( Tretment in Bangalore ) చేయించుకున్నారు.అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

ఇక్కడ కూడా చికిత్స తీసుకుంటూ ఈయన మరణించారు.ఇక ఈయన మరణ వార్త తెలిసి చిత్ర పరిశ్రమ ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఇక ఇంటి పెద్దలు మరణిస్తే ఆస్తి కోసం వారసులు గొడవ పడడం సర్వసాధారణం కానీ శరత్ బాబుకి వారసులు లేకపోయినా తన ఇంట్లో కూడా ఆస్తి తగాదాలు తప్పడం లేదట.

శరత్ బాబు మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయనకు సంతానం లేరు.

ఈ క్రమంలోనే తన సోదరి సోదరుల పిల్లలకు దాదాపు 13 వాటాల ఆస్తులను పంచినట్లు తెలుస్తోంది.ఇలా వారి వాటవారికి పంచిన తనకంటూ కొన్ని ఆస్తులు( Assets ) ఉన్నాయని అయితే ప్రస్తుతం ఈ ఆస్తుల కోసమే తగాదాలు మొదలయ్యాయని తెలుస్తుంది.

ఇక శరత్ బాబు అనారోగ్యానికి గురైనప్పుడు ఆయనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఎవరికి తోచినట్టు ఖర్చు వారు పెట్టారు.అయితే ఆ డబ్బును ఇలా ఆస్తి రూపంలో తీసుకోవాలని కూడా ప్లాన్ చేశారట.

Telugu Problems, Sarath Babu, Tollywood-Movie

ఇలా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడంతో ఇప్పుడు ఈ ఆస్తి గొడవలు మరింత ఎక్కువయ్యాయని అయితే ఆయన చనిపోక ముందు నుంచి కూడా ఆస్తి వివాదాలు జరుగుతూ ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇక శరత్ బాబుకి చెన్నైలోనూ బెంగళూరులోనూ అలాగే హైదరాబాద్లో కూడా ఖరీదైన భవనాలతో పాటు ఎంతో విలువచేసే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.మరి ఈయన ఆస్తి తగాదాల గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.ఏదిఏమైనా శరత్ బాబు నటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి చివరికి ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడం పట్ల చిత్ర పరిశ్రమ ఎంతో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube