కొంతమంది సెలబ్రెటీలు కావాలని చేస్తారో లేక తెలియక చేస్తారో తెలియదు కానీ కొన్ని కొన్ని పొరపాట్లు మాత్రం చేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు.
అయితే తాజాగా మన్మధుడు హీరోయిన్ హిందువుల మనోభావాలు దెబ్బతీసింది.తను చేసిన పని ఇప్పుడు వివాదంగా మారింది.
ఏకంగా దేవుడి దగ్గర చెప్పులు వేసుకొని అందరి దృష్టిలో పడింది.ఇంతకు ఆ మన్మధుడు హీరోయిన్ ఎవరో కాదు.
అన్షు( Anshu ).చాలా వరకు అన్షు అంటే ఎవరు అంతగా గుర్తుపట్టలేరు.కానీ హీరో నాగార్జున ( Nagarjuna )నటించిన మన్మధుడు( Manamadhudu ) సినిమాలోని హీరోయిన్ అనగానే ఇట్టాగే గుర్తుపట్టేస్తారు.అప్పట్లో తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ కూడా ఇప్పటికీ అందరికీ గుర్తుంది ఈ ముద్దుగుమ్మ.ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులకు బాగా టచ్ లో ఉంటుంది.

అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.తన అందం తో మరింత మెప్పించింది.ఇక ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమా( Raghavendra movie ) లో కూడా హీరోయిన్ గా నటించింది.
కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేదు.మిస్సమ్మ సినిమాలో అతిధి పాత్రలో కూడా నటించింది.కానీ ఈమెకు అంతగా అవకాశాలు రాలేకపోయాయి.దీంతో ఏమీ చేయలేక.
సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్.ఆ తర్వాత కొంతకాలానికి లండన్ కు చెందిన సచిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది.
తనకు ఒక పాప, బాబు కూడా ఉన్నారు.ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో లండన్ లోనే ఉంటుంది.
సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ చేస్తుందని తెలిసింది.హీరోయిన్ లు వేసుకునే దుస్తులను తిరిగి మళ్లీ డిజైనింగ్ చేయించి తిరిగి సేల్ చేస్తుందని తెలిసింది.

ఇక సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.ఇక తను చేసిన సినిమాల రీల్స్ వీడియోలను బాగా రీస్టోరీ పెడుతూ ఉంటుంది.అప్పుడప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఫొటోస్ కూడా పంచుకుంటుంది.ఈ వయసులో కూడా తను చాలా అందంగా, మంచి ఫిజిక్ ను మైంటైన్ చేస్తుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని స్టోరీస్ పంచుకుంది.అయితే అందులో తనకు సంబంధించిన ఒక ఫోటో వివాదం సృష్టించింది.
అదేంటంటే హిందువులు మొదటి దైవంగా భావించే వినాయకుడి విగ్రహం దగ్గర అన్షు ఎత్తు చెప్పులు వేసుకుని మరి కెమెరాకు ఫోజ్ ఇచ్చింది.ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్స్ ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
దేవుడి దగ్గర చెప్పులు వేసుకోవడం ఏంటి అంటూ కోపంతో రగిలిపోతున్నారు.అయితే ఆమె కావాలని చేసిందా లేక తెలియక చేసిందా తెలియదు కానీ.
ప్రస్తుతం వివాదంలో మాత్రం ఇరికిందని చెప్పాలి.







