సహచరులు నేలకొరిగినా.. దుండగుడిని హతమార్చి, ఇండో అమెరికన్ పోలీస్ అధికారికి అత్యున్నత పురస్కారం

విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించిన న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎన్‌వైపీడీ)కి చెందిన పది మంది అధికారులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden )అమెరికా అత్యున్నత పురస్కారమైన ‘‘Medal of Valour’’తో సత్కరించారు.అవార్డ్ గ్రహీతల్లో భారత సంతతికి చెందిన 27 ఏళ్ల సుమిత్ సులన్( Sumit Sulan ) కూడా వున్నారు.

 Us President Joe Biden Honours Indian-origin Nypd Officer With Medal Of Valour ,-TeluguStop.com

ఈ ఏడాది జనవరిలో న్యూయార్క్‌లో గృహహింసకు సంబంధించిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తుండగా.తన ఇద్దరు సహచరులను చంపిన నేరస్థుడిని కాల్చి చంపినందుకు గాను సుమిత్‌ ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు.

గత బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో విజేతలకు జో బైడెన్ పురస్కారాలను అందజేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.

న్యూయార్క్‌లోని హార్లెమ్‌ ప్రాంతంలో ఓ మహిళ చిక్కుల్లో వుందని 911కి ఫోన్ వచ్చింది.దీంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులు సులన్, జాసన్ రివెరా, విల్బర్ట్ మోరాలు( Sulan, Jason Rivera, Wilbert Morau ) ఆ ప్రాంతానికి చేరుకున్నారు.అక్కడ పరిశీలిస్తుండగా.నిందితుడు వారిపై మెరుపుదాడి చేశాడు.రివేరా, మోరాలపై కాల్పులు జరపడంతో వారు తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయారు.సహచరులు నేలకొరిగినప్పటికీ.

సులన్ అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించాడు.నిందితుని ఎదుర్కొని అతనిని కాల్చి చంపాడు.

ఆ ఇంట్లో బంధీలుగా వున్న వారిని విడిపించాడు.ఈ ఘటన గురించి తెలుసుకున్న బైడెన్.

సులన్‌ను పిలిపించి అభినందించారు.అతను ప్రదర్శించిన సాహసం, వేగం, ధైర్యానికి దేశం మొత్తం అతనికి కృతజ్ఞతలు చెబుతుందని బైడెన్ అన్నారు.

Telugu Jason Rivera, Medal, York, Sulan, Joe Biden, Wilbert Morau-Telugu NRI

ఇకపోతే.గత వారం భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి కెప్టెన్ ప్రతిమా భుల్లార్ మాల్డోనాడో( Captain Pratima Bhullar Maldonado ) చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.న్యూయార్క్ పోలీస్ శాఖలో అత్యున్నత ర్యాంక్ పొందిన దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కారు.క్వీన్స్‌లోని రిచ్‌మండ్ హిల్‌లో వున్న 102వ పోలీస్ స్టేషన్‌కు ప్రతిమ ఇన్‌ఛార్జ్.ఆమె గత నెలలో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందారు.నలుగురు పిల్లల తల్లి అయిన ప్రతిమ భారత్‌లోని పంజాబ్‌లో జన్మించారు.

తన 9 ఏళ్ల వయసులో ఆమె న్యూయార్క్‌లోని క్వీన్స్‌కు వెళ్లారు.కాగా.

ప్రతిమ వుంటున్న సౌత్ రిచ్‌మండ్ హిల్ అమెరికాలోని అతిపెద్ద సిక్కు కమ్యూనిటీలలో ఒకటి.

Telugu Jason Rivera, Medal, York, Sulan, Joe Biden, Wilbert Morau-Telugu NRI

ఈ సందర్భంగా ప్రతిమ మీడియాతో మాట్లాడుతూ.ఇక్కడ భాషాపరమైన అవరోధాలు వున్నాయన్నారు.అలా ఇబ్బందులు పడుతున్న వారిని తాను ప్రత్యక్షంగా చూశానని ప్రతిమ చెప్పారు.

అమెరికా పోలీస్ శాఖలో మహిళలు, అందులోనూ దక్షిణాసియా సంతతి వారు ర్యాంక్‌లను పొందడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని 33,787 మంది సభ్యులలో 10.5 శాతం మంది ఆసియా మూలాలున్న వారే కావడం గమనార్హం.న్యూయార్క్ నగరం ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మాసాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రతిమ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube