కిడ్నాప్ డ్రామా ఆడి తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన కూతుర్లు..!

ఇటీవల కాలంలో యువత చేస్తున్న పనులు విచిత్రంగా ఉంటూ తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.ముఖ్యంగా విద్యార్థులు హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

 Kolkata Girl Fakes Kidnapping Asks Rs 1 Cr From Parents Details, Kolkata Girl, F-TeluguStop.com

తల్లిదండ్రులు తిట్టినా, కొట్టినా అది పిల్లల భవిష్యత్తు కోసమే.కాబట్టి పరీక్షల ఫలితాల విషయంలో విద్యార్థులకు తల్లిదండ్రుల నుండి కాస్త ఒత్తిడి ఉండడం సహజమే.

మామూలుగా పరీక్షలలో ఫెయిల్ అయిన, లేదంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు( Students ) మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మనం అప్పుడప్పుడు వినే ఉంటాం.

కానీ ఓ 16 ఏళ్ల బాలిక పరీక్షలలో మార్పులు తగ్గడంతో తల్లిదండ్రులతో కిడ్నాప్ డ్రామా ఆడి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేయాలని ప్రయత్నించింది.

తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాప్ డ్రామా బయటపడింది.అసలు ఏం జరిగిందో చూద్దాం.

Telugu Exams, Kidnap, Kidnap Drama, Kolkata, Sisters-Latest News - Telugu

వివరాల్లోకెళితే.కోల్ కత్తా లో( Kolkata ) పరీక్షల ఫలితాలు విడుదల అయిన తర్వాత తన మార్కులను చూసుకునేందుకు ఓ పదహారేళ్ల బాలిక తన ఆరేళ్ల సోదరితో కలిసి ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్ళింది.ఎంతసేపైనా కూతుర్లు ఇంటికి రాకపోవడం, బాలికకు ఫోన్ చేసిన ఫోన్ తగలకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు అక్కాచెల్లెళ్ల కోసం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు.

కానీ ఆ అక్కాచెల్లెళ్ల ఆచూకీ మాత్రం తెలియలేదు.

Telugu Exams, Kidnap, Kidnap Drama, Kolkata, Sisters-Latest News - Telugu

కొంతసేపటికి బాలిక తండ్రికి అపరిచిత నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది.తన ఇద్దరు కుమార్తెల్ని కిడ్నాప్ ( Kidnap ) చేశామని, రూ.కోటి రూపాయలు ఇస్తే విడిచిపెడతామని ఆ మెసేజ్ లో ఉంది.బాలిక తండ్రి పోలీసులకు ఆ మెసేజ్ చూపించడంతో, పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ద్వారా నదియా జిల్లాలోని ఓ నర్సింగ్ హోమ్ ప్రాంతంలో ఆ అక్కచెల్లెల్లు ఉన్నట్లు గుర్తించారు.అక్కడికి వెళ్లి పోలీసులు కాపాడే ప్రయత్నం చేయగా అసలు వాళ్లు కిడ్నాప్ కాలేదని ఇదంతా డ్రామా అని తెలిసి పోలీసులతోపాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు.

పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులకు భయపడి ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు ఆ బాలిక అందరి ముందు అంగీకరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube