యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురం గ్రామంలో శుక్రవారం వీచిన ఈదురు గాలులకు గ్రామానికి చెందిన బీసు శ్రీనివాస్ నిమ్మతోటలోని సుమారు 40 నిమ్మచెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.బాధిత రైతు శ్రీనివాస్ దంపతులు ఆదివారం తోట దగ్గరకు వెళ్లేసరికి నిమ్మచేట్లు నెలకొరిగి ఉండడం చూసి నోరును విలపించారు.
ఈ సందర్భంగా రైతు శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ ఈ ఏడాది పంట మంచిగా వస్తుందని ఆశతో ఎదురుచూశామని,కానీ,ప్రకృతి ప్రకోపానికి తమ నిమ్మతోట పూర్తిగా ధ్వంసమై,తీరని నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతమయ్యారు.ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టపోయినతమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.







