పొత్తు లాభం జనసేన దేనా?

సీఎం సీటుపై పవన్ కళ్యాణ్ఇటీవల వ్యాఖ్యల పై జనసేన( Janasena ) అభిమానుల ను నిరుత్సాహ పరిచినప్పటికీ భారీ స్థాయి వ్యూహం తోనే పవన అలా మాట్లాడారని ఇప్పుడు కొత్త విశ్లేషణలు వస్తున్నాయి తను గెలుచుకున్న సీట్ల సంఖ్యను కాకుండా తమకు వచ్చిన ఓట్ల శాతాన్ని ప్రస్తావించడం ద్వారా తమ బలం ఎక్కడుందో మిగతా పార్టీలు అర్థమయ్యేలా ఆయన వివరించారని అంటున్నారు .తద్వా.

 Janasena Strategical Move Towards Alliance Details, Janasena,janasena Latest New-TeluguStop.com

కీలకమైన స్థానాలను పొత్తు ద్వారా సంపాదించాలని ఆయన భావిస్తున్నారని, ఆయన వ్యూహాలు గనక విజయవంతం అవుతే భవిష్యత్తులో జనసేన కచ్చితంగా కీలక స్థానంలో ఉండే అధికారాన్ని నిర్దేశిస్తుందని వార్తలు వస్తున్నాయి.

Telugu Janasena, Janasena Latest, Janasena Ups, Pawan Kalyan, Pawankalyan-Telugu

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వ్యాఖ్యలతో సీఎం సీటు చంద్రబాబుది అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని తెలుగుదేశం ( Telugu desham party ) శ్రేణులు సంబరపడ్డాయి.పవన్ కళ్యాణ్ పోటీ పడకపోవడంతో వారి మద్దతుతో అధికారంలోకి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుందన్నది వారి ఆలోచన .అయితే రాష్ట్రవ్యాప్తంగా బలం లేకుండా తమకున్న పరిమిత వనరులతో పోటీ చేస్తే 2019 నాటి ఫలితాలు రిపీట్ అవుతాయని అర్థం చేసుకున్న జనసేనా ని ఇప్పుడు మరో కొత్త వ్యూహానికి తెరలేపారని తెలుస్తుంది.బలం ఉన్న వారిదే ముఖ్యమంత్రి పీఠం అని కన్ఫామ్ చేసిన ఆయన తమ బలం ఎక్కడుందో కూడా సంఖ్య లతో సహా చెప్పిన వైనం చూస్తే తన బలం ఉన్నచోట తాను వెనుకకు తగ్గనని తేల్చి చెప్పినట్లయ్యింది తద్వారా తమకు కంచుకోట లాంటి ఉభయగోదావరి జిల్లాలలో బలమైన స్థానాలను, సంఖ్యాపరంగా ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయాలని జనసేన చూస్తుందని తెలుస్తుంది.

Telugu Janasena, Janasena Latest, Janasena Ups, Pawan Kalyan, Pawankalyan-Telugu

అంతేకాకుండా ఉత్తరాంధ్రలో కీలకమైన స్థానాలలో కూడా సీట్లను డిమాండ్ చేయాలని జనసేన చూస్తుందని తెలుస్తుంది ఎలా చూసుకున్నా 50 స్థానాలకు తక్కువ కాకుండా జనసేన సీట్లను డిమాండ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి .మరొకపక్క బీజేపీని కూడా పొత్తు లోకి తీసుకొస్తానని పవన్ చెప్తున్నారు కాబట్టి ఆ పార్టీకి కూడా కనీసం 15 సీట్లు తక్కువ కాకుండా ఇవ్వాల్సి ఉంటుంది మరి 65 సీట్లను పొత్తు లో భాగంగా వదులుకుంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు ఎన్ని? అందులో గెలిచేవి ఎన్ని ? అన్నది ఇప్పుడు తెలుగు తమ్ములను వేధిస్తున్న ప్రశ్న .మొత్తం 175 స్థానాల్లో ఒక అరవై ఐదు స్థానాలు వరకు మిత్రులకు వదులుకుంటే మిగిలిన సీట్లలో సొంతంగా అధికారంలోకి వచ్చే సీను ఉందా అని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట అంతేకాకుండా తమకు బలమైన స్థానాలను పొత్తు ధర్మం కోసం వదులుకుంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళన కూడా తెలుగు తమ్ముళ్లు వేధిస్తుందని తెలుస్తుంది.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారం సాధించాలని భావిస్తున్న చంద్రబాబు సీట్ల విషయంలో కాస్త ఉదారంగానే ఉంటారని వార్తలు వస్తున్నందున చాలామంది రాజకీయ భవిష్యత్తు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube