బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
భారీ వాన కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.రహదారులన్నీ చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అదేవిధంగా పలు చోట్లు ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి.దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.







