15 నిముషాల పాత్రకే రూ.100 కోట్ల బిజినెస్.. మరి పవన్ క్రేజ్ అలాంటిది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అండ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.వినోదయ సీతం అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

 100 Crores Business For Pawan Bro Movie, Vinodhaya Sitham, Pawan Kalyan, Pawan B-TeluguStop.com

అయితే ఇది రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి మొన్న మేకర్స్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.”బ్రో( Bro Movie )” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు మోషన్ పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ మోషన్ పోస్టర్ కు యునానిమస్ రెస్పాన్స్ లభించింది.తమిళ్ లో నటించి తెరకెక్కించిన సముద్రఖని ( Samuthirakani )ఇక్కడ కూడా తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ కూడా స్టార్ట్ అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 85 కోట్ల బిజినెస్ చేయగా కర్ణాటక, ఓవర్సీస్ కలిపి 15 కోట్ల బిజినెస్ చేసిందట.మొత్తంగా ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ అయితే చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూట్ ను పూర్తి చేసాడు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటిస్తున్నాడు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం 15 నిముషాలు మాత్రమే ఉంటుందట.ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది.సినీ వర్గాల్లో ఈ రూమర్ జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇదే నిజమైతే 15 నిముషాలు కనిపించే పవన్ వల్ల 100 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.ఇది ఆయన స్టామినా.

మరి ఈ రూమర్ విషయంలో ఫ్యాన్స్ కు మేకర్స్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube