అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌ను ఫాలో అవుతున్న బైడెన్.. ‘‘హౌడీ మోడీ’’ తరహాలో భారీ ఈవెంట్‌కు ప్లాన్..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .

 Joe Biden May Be At Pm Modi’s Mega Indian Diaspora Event In Us, Howdy Modi, Jo-TeluguStop.com

ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.

ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్‌, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.

అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.

2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలు( Republican and Democratic parties ) సిద్ధమవుతున్న నేపథ్యంలో అమెరికాలో నిర్ణయాత్మక శక్తిగా వున్న భారతీయ కమ్యూనిటీని మచ్చిక చేసుకునే పనులు మొదలైనట్లుగా తెలుస్తోంది.రాజకీయాల్లో ఆరితేరిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.

(Joe Biden ).భారతీయులతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు.ఆయన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అధికార యంత్రాంగంలో అత్యధిక మంది భారతీయులకు పదవులు కట్టబెట్టారు.దాదాపు 150 మందికి పైగా భారత మూలాలున్న వారు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.ఇవన్నీ బైడెన్ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.తద్వారా భారతీయుల మద్ధతు కూడగట్టాలన్నది ఆయన ప్లాన్.

Telugu Donald Trump, Howdy Modi, Joe Biden, Joebiden, Kamala Harris-Telugu NRI

ఇదిలావుండగా.భారత ప్రధాని నరేంద్రమోడీతో( Prime Minister Narendra Modi ) కలిసి భారీ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు జో బైడెన్.గత అధ్యక్ష ఎన్నికలకు ముందు 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .హ్యూస్టన్‌లో ‘‘హౌడీ మోడీ’’( Howdy Modi ) కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బైడెన్ కూడా అదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.

త్వరలో భారతీయ ప్రవాసులు ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో తాను నరేంద్ర మోడీతో కలిసి హాజరవుతానని శనివారం బైడెన్ తెలిపారు.

Telugu Donald Trump, Howdy Modi, Joe Biden, Joebiden, Kamala Harris-Telugu NRI

జపాన్‌లోని హిరోషిమా నగరంలో జీ 7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాలకు మోడీ హాజరయ్యారు.ఇదే సమయంలో శనివారం అక్కడే క్వాడ్ దేశాధినేతల సమావేశం జరిగింది.

ఈ ఈవెంట్‌లో బైడెన్, మోడీలు పాల్గొన్నారు.భారత విదేశాంగ శాఖ ప్రకారం.

మోడీ జూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.వైట్‌హౌస్‌లో బైడెన్ ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

అలాగే మోడీ గౌరవార్ధం జూన్ 22, 2023న అమెరికా అధ్యక్షుడు విందు ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube