దొండ సాగులో వేరుకుళ్ళు, వెర్రి తెగుల నివారణ కోసం చర్యలు..!

కూరగాయ పంటలలో దొండ పంట( Donda crop ) కూడా ఒకటి.దొండలో విటమిన్లు, ఐరన్, కాల్షియం పాటు పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.

 Actions For The Prevention Of Root Rot And Crazy Pests In Cultivation Of Donda ,-TeluguStop.com

కాబట్టి మార్కెట్లో దొండకు మంచి డిమాండ్ ఉంది.ఒక్కసారి దొండ పంట నాటుకుంటే మూడు సంవత్సరాల వరకు పంట దిగుబడి పొందవచ్చు.

సాధారణ పద్ధతిలో కాకుండా పందిరి విధానంలో దొండను సాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చు.

నీటి వనరులు సమృద్ధిగా ఉంటే ఏడాదిలో ఏ నెలలోనైనా దొండను నాటుకోవచ్చు.

మురుగునీరు పోయే వసతి కలిగిన నేలలు, పొడి వాతావరణం దొండ సాగుకు అనుకూలంగా ఉంటాయి.ఒక ఎకరానికి 2000 కాండం ముక్కలను నాటుకోవాలి.

పొలంలో నాటుకునే ముందు ఈ కాండం ముక్కలను మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్( Copper oxychloride ) ద్రావణంలో కాసేపు ముంచి, తరువాత నాటుకోవాలి.

Telugu Agriculture, Copper, Donda Crop, Dymidhoet, Latest Telugu, Metalaxyl-Late

దొండ మొక్కల పాదుల వద్ద కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.నేల యొక్క స్వభావాన్ని బట్టి వారానికి ఒకసారి నీటి తడులు అందించాలి.ఇక దొండ సాగుకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త అధికంగానే ఉంటుంది.

దొండ నాటిన 60 రోజుల తర్వాత పూత రావడం ప్రారంభం అవుతుంది.అప్పటినుండి పంటను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

Telugu Agriculture, Copper, Donda Crop, Dymidhoet, Latest Telugu, Metalaxyl-Late

వేరు కుళ్ళు తెగులు, వెర్రి తెగులు పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ తెగుల వల్ల మొక్క కాండం పూర్తిగా కుళ్ళిపోతుంది.కాబట్టి వెంటనే ఒక లీటరు నీటిలో రెండు గ్రాముల మెటాలాక్సిల్ ( Metalaxyl )కలిపి నేల బాగా తడిచేలాగా పొలంలో పోయాలి.ఇక బెర్రీ తెగులు ఆశించిన మొక్కల యొక్క ఆకులు సార్లతో నిండి, పూత, పిందెలు గిడస బారి పోతాయి.

ఈ తెగులు సోకిన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేసి నాశనం చేయాలి.తరువాత లీటర్ నీటిలో రెండు మిల్లీలీటర్ల డైమిధోయెట్ ను కలిపి పంటకు పిచికారి చేయాలి.

ఈ రెండు తెగులను సకాలంలో గుర్తించి నివారించకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube