నోయిడాలోని సెక్టార్ 12( Sector 12, Noida ) ప్రాంతంలో శనివారం రాత్రి ఒక వ్యక్తి ఆడ వీధికుక్క లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనను సమీపంలోని రెసిడెన్షియల్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
దీన్ని చూసిన జనాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో తక్కువ సమయంలోనే వైరల్ అయ్యింది.
డాగ్ లవర్స్, జంతు హక్కుల కార్యకర్తలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.వారు నేరస్థుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
జంతు హక్కుల కార్యకర్త కావేరి రాణా భరద్వాజ్ ( Kaveri Rana Bhardwaj )పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వైరల్ వీడియోలో నిందితుడు ఆడ వీధికుక్క వద్దకు వెళ్లి పదేపదే వేధింపులకు గురిచేస్తున్నట్లు స్పష్టంగా అనిపించింది.
ఈ చర్య అత్యాచారం అని భరద్వాజ్ ( Bharadwaj )తన ఫిర్యాదులో పేర్కొన్నారు.కెమెరాలో రికార్డ్ అయిన నిందితుడిపై తగిన అభియోగాలు మోపాలని ఆమె పోలీసులను రిక్వెస్ట్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు అధికారులను నియమిస్తామని నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) హరీశ్ చందర్ ( Harish Chander )హామీ ఇచ్చారు.ఈ బాధాకరమైన సంఘటనపై స్పందించి అవసరమైన, తగిన చర్యలు తీసుకోవాలని సెక్టార్ 24 పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారిని డీసీపీ చందర్ ఆదేశించారు.ఈ ఘటనపై చాలా తీవ్రంగా స్పందించారు.
అభం శుభం తెలియని మూగజీవాలపై అత్యాచారాలు చేస్తున్న కామాంధులకు కఠిన శిక్ష విధించాలని వారు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.