Jr Ntr , Raviteja : రవితేజ నటించిన కిక్ సినిమాను మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

 Do You Know Ravi Tejas Kick Movie First Choice Is Jr Ntr-TeluguStop.com

సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాలలో కిక్( kick ) సినిమా కూడా ఒకటి.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

Telugu Jr Ntr, Kick, Raviteja, Tollywood-Movie

కాగా ఇందులో ఇలియానా( Ileana ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ వెంకట్ నిర్మించిన ఈ మూవీ అప్పట్లో భారీగా వసూళ్లను సాధించింది.అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమా ఎన్టీఆర్( NTR ) చేయాల్సిందట.కానీ అప్పటికే ఈ మూవీ స్టోరీని తారక్ కు చెప్పారట డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Surender Reddy ).కానీ ఎన్టీఆర్ కాకుండా రవితేజ ఈ మూవీ కంప్లీట్ చేశారు.కథను ముందుగా సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కు వినిపించాడట.

అయితే అంతకు ముందు 2006లో ఆయనతో చేసిన అశోక్ సినిమా ప్లాప్ అయ్యింది.ఆ చిత్రానికి వక్కంతం వంశీనే కథను అందించారు.

Telugu Jr Ntr, Kick, Raviteja, Tollywood-Movie

ఇక వీరిద్దరి కాంబోలో 2007లో మహేష్ బాబుతో( Mahesh Babu ) చేసిన అతిథి చిత్రం సైతం ప్లాప్ అయ్యింది.దీంతో 2009లో కిక్ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఆసక్తిని చూపించలేదట.దాంతో పాటు అప్పటికే చేతిలో మరిన్ని చిత్రాలు ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాను వదిలేసుకున్నారట.తర్వాత ఈ సినిమా కథను సురేందర్ రెడ్డి రవితేజకు వినిపించడం, రవితేజ ఒకే చేయడం సినిమా మంచి విజయం సాధించడం ఇలా అన్ని జరిగిపోయాయి.

కాగా జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఈ సినిమా అనే కాకుండా గతంలో చాలామంది హీరోలు నటించిన సినిమాలు మిస్ చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube