ఎన్టీఆర్ ''దేవర'' సినిమాలో మరో స్టార్ జాయిన్.. ఎవరంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) బర్త్ డే కోసం ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చూసారు.ఎప్పుడెప్పుడు బర్త్ డే ట్రీట్ మేకర్స్ అందిస్తారా ఆతృతగా ఎదురు చూడగా ఆ ట్రీట్ ఒక రోజు ముందుగానే అందింది.

 Actor Shine Tom Chacko In Ntr Devara Details, Ntr, Devara, Koratala Shiva, Janhv-TeluguStop.com

నిన్న సాయంత్రమే తారక్ బర్త్ డే ట్రీట్ ను కొరటాల( Koratala Siva ) అందించారు.ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”.

ఈ సినిమాకు నిన్ననే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.”దేవర” ( Devara )అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయగా ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది.ఇక ఈ అప్డేట్ తో కొరటాల ఈ సినిమాను ఎంత పవన్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడో అర్ధం అవుతుంది.అలాగే కొరటాల ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ తారాగణం భాగం కాగా అక్కడ కూడా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది.ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి అడుగు పెట్టబోతోంది.అలాగే విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది.ఆయన మలయాళం స్టార్ అని తెలుస్తుంది.

ఇటీవలే దసరా సినిమాలో నటించి మెప్పించిన షైన్ టామ్ చాకో( Shine Tom Chacko ) ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా భాగం అయినట్టు తెలుస్తుంది.ఈయన ఈ రోజు నుండి సెట్స్ లో జాయిన్ అయ్యాడట.కొరటాల పలు కీలక సన్నివేశాలను ఈయనపై తెరకెక్కిస్తున్నాడు అని టాక్ బయటకు వచ్చింది.

ఇక యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube