తెలంగాణ రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది.సర్కార్ అమలు చేస్తున్న పారిశ్రామిక విధానంతో పాటు అందిస్తున్న ప్రోత్సాహంతో పలు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తాజాగా ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం అయిన టెక్నిప్ ఎఫ్ఎంసీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.దాదాపు రూ.1250 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం ద్వారా సుమారు 3 వేల 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.కాగా ప్రస్తుతం ఆయన పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.







