2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్ - హారిస్ గెలుపే లక్ష్యం, రంగంలోకి ఇండో అమెరికన్లు

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( 2024 US Elections ) పోటీ చేస్తున్నట్లు జో బైడెన్, కమలహారిస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా ఇప్పటికే బైడెన్-హారిస్ టీమ్ ప్రచారాన్ని, నిధుల సేకరణను ప్రారంభించింది.

 2024 Us Election Indian American Support For Biden-harris Re-election Campaign G-TeluguStop.com

ఈసారి కూడా బైడెన్, హారిస్‌లను గెలిపించేందుకు పలువురు భారతీయులు రంగంలోకి దిగారు.అలాగే ఇటీవల డెమొక్రాటిక్ పార్టీకి( Democratic Party ) రుణదాతలుగా వున్న 150 మందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు బైడెన్.

( President Joe Biden ) ఈ ఈవెంట్‌కు భారత సంతతికి చెందిన అజయ్ జైన్ భూటోరియా కూడా హాజరయ్యారు.ఈయన సిలికాన్ వ్యాలీలో వ్యవస్థాపకుడిగా రాణిస్తున్నారు.

అలాగే డెమొక్రాటిక్ పార్టీ డిప్యూటీ నేషనల్ ఫైనాన్స్ చైర్ కూడా.

Telugu Biden Harris, Deepak Raj, Democratic, Dinesh Sastry, Kamala Harris, Joe B

ఇక కాలిఫోర్నియాకు చెందిన పొలిటికల్ అండ్ బిజినెస్ స్ట్రాటజిస్ట్ , బైడెన్-హారిస్ ఎన్‌ఎఫ్‌సీకి నియమితులైన దినేశ్ శాస్త్రి మాట్లాడుతూ.బైడెన్ విక్టరీ ఫండ్, బైడెన్-హారిస్ ఎన్‌ఎఫ్‌సీ‌లు ఈసారి కూడా శక్తివంచన లేకుండా శ్రమిస్తాయని చెప్పారు.డెమొక్రాటిక్ నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఓటింగ్ హక్కులు, మహిళలు తమ సొంత ఆరోగ్య సంరక్షణను ఎంచుకునే హక్కు వంటి ప్రాథమిక సమస్యలకు సంబంధించిన ఈవెంట్‌లను ప్లాన్ చేస్తున్నారు.

బైడెన్, జిల్ బైడెన్, కమలా హారిస్, డౌగ్ ఎంహాఫ్‌లతో దాతలకు ఫోటోలు దిగే అవకాశాలు కూడా వుంటాయని శాస్త్రి తెలిపారు.

Telugu Biden Harris, Deepak Raj, Democratic, Dinesh Sastry, Kamala Harris, Joe B

డెమొక్రాటిక్ పార్టీ . ఫండ్ రైజింగ్ కార్యక్రమాల ద్వారా 2 బిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.సిలికాన్ వ్యాలీకి చెందిన భారత సంతతికి చెందిన ఫండ్ రైజర్లయిన విష్ అకెళ్ల, స్వదేశ్ ఛటర్జీ, శేఖర్ నరసింహాన్, దీపక్ రాజ్‌లు 2020 ఎన్నికల్లో బైడెన్ కోసం నిధులు సేకరించడంలో కీలకపాత్ర పోషించారు.

గతంలో మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, వైస్ ప్రెసిడెంట్ అల్ గోర్‌లు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా చాలా మంది భారతీయులు తెరవెనుక చక్రం తిప్పారు.ఇప్పుడు బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో ఎక్కువ మంది భారతీయ అమెరికన్లు భాగస్వాములయ్యారని శాస్త్రి చెప్పారు.లా సంస్థలు, భారతీయ అమెరికన్ కంపెనీలు, ఐటీ నిపుణులు, సాంస్కృతిక సమూహాలను తాను కలుస్తానని దినేశ్ శాస్త్రి చెప్పారు.2003 నుంచి 2005 వరకు ఆయన బైడెన్ కోసం నిధులు సేకరించారు.2020లో కమలా హారిస్ ఫైనాన్స్ కమిటీలోనూ ఆయన వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube