సీక్వెల్స్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సినిమాకి టాక్ వచ్చిన రాకపోయినా ఓపెనింగ్స్ దుమ్ము లేచిపోతాయి.
అది కేవలం మన తెలుగు హీరోలకు మాత్రమే కాదు, డబ్బింగ్ సినిమాలు కూడా గతం లో సీక్వెల్స్ గా విడుదల అయ్యి సంచలనం సృష్టించాయి.ఇప్పుడు బిచ్చగాడు సీక్వెల్ ‘బిచ్చగాడు 2 ‘ ( Bichagadu 2 ) కూడా అదే విధంగా ఆడుతుంది.2016 వ సంవత్సరం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన బిచ్చగాడు చిత్రం అంటే ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.అప్పట్లో కేవలం మౌత్ టాక్ మీద ఈ చిత్రం అటు తమిళనాడు ఇటు ఆంధ్ర ప్రదేశ్ కలిపి 25 కోట్ల రూపాయిలు వసూలు చేసింది.
టీఆర్ఫీ రేటింగ్స్ లో కూడా ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది.జెమినీ టీవీ లో ప్రసారమైన ఈ సినిమాకి అప్పట్లో 18 కి పైగా రేటింగ్స్ వచ్చాయి.
చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఇలాంటి రేటింగ్స్ సాధ్యపడలేదు.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది.మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.షేర్ లెక్క చూస్తే రెండు కోట్ల రూపాయిలు కచ్చితంగా ఉంటుంది.
నేడు కూడా ఈ చిత్రం మార్నింగ్ షోస్ నుండే డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది.నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి మూవీ ని( Simhadri Movie ) రీ రిలీజ్ చేసారు.
ఈ రీ రిలీజ్ మేనియా లో బిచ్చగాడు కొట్టుకుపోతుంది ట్రేడ్ భయపడింది.కానీ మ్యాట్నీ షోస్ నుండి ‘బిచ్చగాడు 2’ చిత్రం సింహాద్రి ని డామినేట్ చేసింది.
ఇది చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు.డివైడ్ టాక్ వచ్చిన ఒక సినిమాకి ఇంత వసూళ్లా?, మన తెలుగు ఆడియన్స్ కి బిచ్చగాడు చిత్రం అంటే ఇంత ఇష్టమా అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.

విజయ్ ఆంటోనీ( Vijay Antony ) చేతికి వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని పాడు చేసుకున్నాడని, సెకండ్ హాఫ్ కాస్త బాగా తీసి ఉంటే ఈ చిత్రం తెలుగు వర్షన్ నుండే 30 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసి ఉండేదని, విజయ్ ఆంటోనీ తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యే వాడని అంటున్నారు.అయితే ఇప్పటికీ కూడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ కచ్చితంగా చేరుకుంటుంది.రెండు రోజుల్లో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , మూడవ రోజు ఆదివారం అవ్వడం తో ఆరోజుతోనే బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా చేరుకుంటుందని,ఇక నుండి వచ్చేది మొత్తం లాభాలే అంటున్నారు.వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కాస్త ఊపిరి ని ఇచ్చిన సినిమాగా బిచ్చగాడు 2 చిత్రం నిలిచిందని, చిన్న మొత్తం లో అయిన లాభాలతో బయటపడి , గత సినిమాలు చేసిన నష్టాలు కాస్త అయిన రికవర్ అవుతుందని అంటున్నారు.







